పాత స్తంభాలతో మండల ప్రజలకు తప్పని ప్రమాద భయం
చక్రవాణి న్యూస్, మల్హర్: ఆగస్టు 20
తాడిచెర్లలోని ఫ్రెండ్స్ గజానన మండలి సమీపంలో కాలం చెల్లిన పాత విద్యుత్ పోల్ విరిగిపోయి, దానికి సంబంధించిన కరెంటు వైర్లు వేలాడుతూ కనిపిస్తున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్కనే నూతన విద్యుత్ పోల్ ఏర్పాటు చేసినప్పటికీ, పాత పోల్కే మినీ ట్రాన్స్ఫార్మర్ ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి పాత పోల్‌ను తొలగించి ప్రమాదాన్ని నివారించాలని స్థానికులు కోరుతున్నారు.
మల్హర్ రావు మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ వ్యవస్థ ప్రమాదకరంగా మారింది. పాతబడిన విద్యుత్ స్తంభాలు పక్కకు ఒరిగిపోవడం, తీగలు కిందకు వేలాడుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. తాడిచెర్లతో పాటు వ్యవసాయ పంట పొలాల్లోని పరిసర ప్రాంతాల్లో కొన్ని విద్యుత్ తీగలు చేతికందే ఎత్తులో కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. రైతులు పొలాలకు వెళ్లే మార్గాల్లో, పశువులు మేతకు వెళ్లే ప్రాంతాల్లో తీగలు వేలాడుతుండటంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది.
నివాసాల సమీపంలోనూ వైర్లు ఉండటంతో చిన్నారుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చిన్నపాటి గాలులకే తీగలు ఒకదానికొకటి తాకి స్పార్కులు వస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు.
ఒరిగిన, శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని, కిందకు వేలాడుతున్న తీగలను వెంటనే సరిచేయాలని మండల ప్రజలు విద్యుత్ శాఖ అధికారులను కోరుతున్నారు.
Chakravaninews1.blogspot.com


0 Comments